కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుతో కలిసి KPHB లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు… ముందుగా బాలాజీనగర్ డివిజన్ లోని JNNURM కాలని వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమం నిర్వహించి కెపిహెచ్బి 3 వ ఫేస్ లోని పార్కులను ప్రారంభించారు. అనంతరం 3 కోట్ల 50 లక్షల రూపాయలతో పలు సీసీ రోడ్లు పునరుద్ధరణ పనులు…పార్కుల అభివృద్ధికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కెపిహెచ్బి డివిజన్లోని పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పార్కులు ఏర్పాటు చేశామని.. ఇండోర్ స్టేడియంలు.. షటిల్ కోర్ట్ సిమ్మింగ్ పూల్స్ వంటి అన్ని మౌలిక సదుపాయాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.. అలాగే ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు…. పెండింగ్లో ఉన్న సిసి రోడ్డు పునరుద్ధరణ పనులకు కూడా శంకుస్థాపన నిర్వహించామని ..ఆగస్టు కల్లా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలిపారు.. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ పగడాల శిరీష బాబురావు.. మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్.. జోనల్ కమిషనర్ మమత, డిసి రవికుమార్.. ఈ ఈ సత్యనారాయణ.. డి ఈ ఆనంద్.. ఏ ఈ సాయి ప్రసాద్.. డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి.. ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..