కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన నిర్వహించారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పాదయాత్రలో గుర్తించిన పెండింగ్ పనులను పూర్తిచేయాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నిధులు మంజూరు చేయించుకుని వెంటనే పనులు పూర్తి చేసేలా నేడు శంకుస్థాపన నిర్వహించామని తెలిపారు ..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ..మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రపంచ వేదికపై హైదరాబాద్ మహానగరం నేడు పెట్టుబడులకు స్వర్గ దామముగా మారిందని ఇందుదకనుగుణంగానే బస్తీలు కూడా ఎంతో మెరుగ్గా ఉండాలని ఉద్దేశంతో నిధులు కొరత లేకుండా అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నామని… ఆకలితో వచ్చే వారికి నేనున్నానంటూ అన్నం పెట్టి కడుపు నింపే నగరం మన భాగ్యనగరం అని.. అందరినీ ఆదరిస్తున్న హైదరాబాద్ మహానగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో బోయిన్పల్లి నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర కే.పి.హెచ్.బి డివిజన్ వరకు చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు ఏమి లేవని వాటిని మంత్రి కేటీఆర్ సహకారంతో 150 కోట్లు మంజూరు చేశారని వాటితో డ్రైనేజీ సమస్యలు రోడ్డు సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎదురులేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు… ఈ సందర్భంగా సర్దార్ పటేల్ నగర్.. సాయి నగర్ లోని సిసి రోడ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు..