మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పరిధిలోని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్- పెట్రో కార్స్ అధికారుల పాత్ర కీలకం అని, డయల్ 100 కాల్ వచ్చినప్పుడు అత్యవసర సమయంలో బాదితులకి వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలని, సేవలు అందించాలని బ్లూ కోల్ట్స్ మరియు పెట్రో కార్ సిబ్బంది, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఫ్రెండ్లీ పోలీసింగ్, విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా అత్యవర సేవలు అయిన రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, పట్టణాల, గ్రామాలలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన వాటికి సంబందించిన డయల్ 100 కాల్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది లేదా పెట్రోల్ వెహికల్స్ సిబ్బంది తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్యూటీ లో భాగంగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయవలసిన అంశాల గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అలాగే బ్లూ కోల్ట్ సిబ్బంది లేదా పెట్రోల్ వెహికల్స్ సిబ్బంది తమ విధులలో భాగంగా పాయింట్ బుక్స్, ఎం.ఓ క్రిమినల్స్ ను చెక్ చేయడం గురించి తగు సూచనలు చేశారు. ప్రజలలో భద్రతభావం పెంపొందిస్తూ నేరస్థులకు నేరం చేస్తే పట్టుబడుతామనే భయం కల్గించే లక్ష్యంతో బ్లూ కోల్ట్స్ సిబ్బంది విభాగంలోని అధికారులు తమ ఏరియాపై సమగ్ర సమాచారం కలిగి ఉండి ఆ ప్రాంత ప్రజల రక్షణకు భరోసా కల్పించాలని అన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న క్రిమినల్స్ ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించాలని అన్నారు. అలాగే విధులు నిర్వహించే సమయాలలో సేఫ్టీ మెజర్స్ పాటించాలని సిబ్బందికి సూచించారు. గస్తీ తిరుగుతున్న ఏరియా నుండి రిపోర్ట్ చేయబడిన అన్ని డయల్100 ఫిర్యాదులను నిర్ణిత సమయంలో అటెండ్ చేయడంతో పాటు బాధితులకు సత్వర సేవలు అందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీ.సి.అర్.బి ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఎస్.బి ఇన్స్పెక్టర్ ఫనిదర్, టౌన్ సీఐ సతీష్, బ్లూ కోల్ట్ మరియు పెట్రో కార్ సిబ్బంది పాల్గొన్నారు.