మనఊరు…మనబడి పాఠశాలల అభివృద్ధి పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మనఊరు…మనబడి పాఠశాలల అభివృద్ధి పనుల ప్రగతిని సంబంధిత మండల ప్రత్యేకధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలం ముగియక ముందే పనులు వేగవంతం గా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆసక్తి చూపని ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని, వీలుకాని పక్షంలో ఇతర స్కూల్స్ కు అవకాశమివ్వాలన్నారు.
నెలాఖరులోగా సివిల్ వర్క్స్, ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టే పనులు పూర్తి చేయాలన్నారు. పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని, పాఠశాలలో కావాల్సిన డ్యూయల్ డెస్క్ లు, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యా సంవత్సరం మొదలయ్యే లోగా పనులు పూర్తి చేసి అందించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో జడ్పి సి.ఈ.ఓ. రమాదేవి, డి.ఆర్.డి.ఓ.సన్యాసయ్య, విద్యాశాఖ అధికారి రామారావు, ఇంజనీరింగ్ అధికారులు తానేశ్వర్, సురేష్, హేమలత, మండల ప్రత్యేక అధికారులు సూర్యనారాయణ, వెంకటరెడ్డి, సురేష్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Mahabubabad: ‘మనఊరు-మనబడి’ నెలాఖరులో పూర్తి
- Advertisement -