Saturday, July 27, 2024
HomeతెలంగాణMahabubnagar: అరుణమ్మ గెలుపు మోదీకి మనం ఇచ్చే బహుమతి

Mahabubnagar: అరుణమ్మ గెలుపు మోదీకి మనం ఇచ్చే బహుమతి

కాంగ్రెస్ కు ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ఎంపీగా డీ కే అరుణమ్మను గెలిపించి నరేంద్ర మోదీకి బహుమతి ఇద్దామని రాజ్య సభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీగా నామినేషన్ వేశారు. ఉదయం కాటన్ మిల్లు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డీకే అరుణ నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజ నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం పొందారు. దేవస్థానం నుండి ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జి రవినాయక్ కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

- Advertisement -

నామినేషన్ అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణం మొత్తం కాషాయం జెండాలు రెపరెపలాడాయి. ర్యాలీగా వెళ్లి క్లాక్ టవర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ…..నరేంద్ర మోదీకి సరితూగే వ్యక్తి కాంగ్రెస్ లో లేరని, ఈ ధర్మ యుద్ధంలో బీజేపీదే విజయం అని అన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 14 ఎంపీ సీట్లు గెలిస్తేనే పథకాలు అమలు చేస్తామని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం గాంధీ కుటుంబం కోసం పని చేస్తుందని, బీజేపీ మాత్రం ఈ దేశం కోసం, మన బిడ్డల భవిషత్తు కోసం పని చేస్తోందని అన్నారు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ బీజేపీ ధ్యేయం అన్నారు. మైనార్టీలను, ఎస్సీ, ఎస్టీ లను అక్కున చేర్చుకున్నది బిజేపీ అని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తోందని తెలిపారు. కులం, మతం పేరుతో కాంగ్రెస్ ఈ దేశాన్ని విచ్చిన్నం చేస్తోందని ఆరోపించారు. వాల్మీకిలకు న్యాయం జరగాలంటే బీజేపీ వల్లనే సాధ్యం అవుతుందని, రేవంత్ రెడ్డి వాళ్ళ మీద కపట ప్రేమ చూపుతున్నాడని అన్నారు. ఇండియా కూటమిలో వాళ్ళల్లో వాళ్ళకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ మళ్ళీ గెలిచి విశ్వాగురువుగా భారత్ అవతరిస్తుందన్నారు.

మరోసారి మోదీ సర్కార్… డీకే అరుణ…

దేశంలో మరోసారి మోదీ సర్కారు రానుందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని, ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శలు చేశారు. దేశం కోసం ఇప్పుడు ఓటు వేద్దామని, మోడీని మళ్ళీ ప్రధాన మంత్రిని చేయడానికి మనందరం పోరాటం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది మురికి కాలువలో వేసినట్లేనని అన్నారు. తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేశానని ప్రాజెక్టులు, రోడ్లు నిర్మించానని అన్నారు. ఇప్పుడు మళ్ళీ మోదీ నాయకత్వములో మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. తను మహిళనని కూడా చూడకుండా కొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ప్రజలు వాళ్లకు తగిన బుద్ది చెబుతారని అన్నారు. తనకు పదవులు ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల మధ్యే ఉన్నానని, వాళ్ళ కష్ట సుఖాలలో అండగా ఉన్నానని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ ఏ వి ఎన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు నాగురావ్ నామాజీ, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పాండు రంగా రెడ్డి,కొండయ్య, కొండా ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News