Saturday, November 23, 2024
HomeతెలంగాణMahabubnagar: పోడు భూముల పట్టాల పంపిణీతో 50 ఏళ్ల గిరిజనుల సమస్యకు పరిష్కారం

Mahabubnagar: పోడు భూముల పట్టాల పంపిణీతో 50 ఏళ్ల గిరిజనుల సమస్యకు పరిష్కారం

ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న గిరిజనుల పోడు భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించిందని రాష్ట్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మన్వాడ మండలం దాచక్ పల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు. 26 మంది గిరిజనులకు 13 ఎకరాల 20 గుంటల పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోడు భూముల సమస్య ఎన్నో ఏళ్లుగా కొనసాగిందని, అలాంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చామని అన్నారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని,తాము అహర్నిశలు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి దాచక్ పల్లి గ్రామంలో టాంకర నుండి దాచక్ పల్లి వరకు 52 లక్షల 50 వేల రూపాయలతో ఆధునికరించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. 19 లక్షల 24 వేల రూపాయల వ్యయంతో మన ఊరు- మనబడి కింద నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. 18 లక్షల రూపాయల వ్యయంతో దేవాలయం ప్రహరీని పారపీట్ వాల్ నిర్మించగా దానిని ప్రారంభించారు. దీంతోపాటు గ్రామంలో ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 సిసి రోడ్లను ప్రారంభించారు.

అనంతరం దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో దేవాలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తాము గిరిజనులపోడు భూముల సమస్యను తీర్చడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అన్ని గ్రామాలకు సిసి రోడ్లు, తాగునీరు, మురికి కాలువల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. తెలంగాణ రాకముందు కేవలం 200 రూపాయల పెన్షన్, 3 గంటలు మాత్రమే విద్యుత్తు వచ్చేదని ,సరైన పంటలు పండక, ఎన్నో కష్టాలను రైతుల ఎదుర్కున్నారని అలాంటిది ఈ రోజు 24 గంటల ఉచిత విద్యుత్తు తో పాటు, 2000 రూపాయల పెన్షన్, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ ,రైతు బీమా ,రైతు బంధు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని, ఇలాంటి పథకాలు పక్కన ఉన్న కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో సైతం లేవని దీనిని ప్రజలు గుర్తించాలని అన్నారు.మనఊరు-మన బడి కింద పాఠశాల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, భవిష్యత్తులో గ్రామానికి సంబంధించి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. దాచక్ పల్లి గ్రామం నుండి 6 మంది విద్యార్థులు కేజీబీవీకి ఎంపికయ్యారని, హన్వాడ మండల కేంద్రంలో 2 బీసీ మహిళ గురుకులాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థిపై లక్ష 25 వేల రూపాయల ఖర్చుతో చదివించడం జరుగుతుందని తెలిపారు . చెంచు కాలానికి కోటి 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బిటి రోడ్డుకు త్వరలోనే టెండర్లను రీకాల్ చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అంతకుముందు మంత్రి గ్రామంలో తిరిగి గ్రామంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హన్వాడ ఎంపీపీ బాలరాజు, దాచక్ పల్లి సర్పంచ్ బాల కిష్టా రెడ్డి,తహసిల్దార్ బక్కశ్రీనివాస్, ఎంపీడీవో ధనంజయ గౌడ్ ,మాజీ జెడ్పిటిసి కరుణాకర్ గౌడ్,రమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News