Ponnam on Dubba Rupa death: కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గారి ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు.
దుబ్బ రూప గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మహిళా విభాగంలో చురుకైన పాత్ర పోషించారు. ఆమె ఆకస్మిక మృతి పార్టీకి, మహిళా విభాగానికి తీరని లోటు అని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ విషాద సందర్భంలో పొన్నం ప్రభాకర్ తన అధికారిక సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
“మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గారి ఆకస్మిక మృతి వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె మృతి పట్ల నా హృదయపూర్వక సంతాపానాన్ని వ్యక్తం చేస్తున్నాను. దుబ్బ రూప గారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.
ఆమె కుటుంబానికి, బంధుమిత్రులకు ఈ బాధాకరమైన సమయాన్ని తట్టుకునే శక్తిని ఆ దేవుడు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. దుబ్బ రూప గారు పార్టీ కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.
దుబ్బ రూప చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ, ముఖ్యంగా మహిళల హక్కులు, సాధికారత కోసం కృషి చేశారు. మహిళా కాంగ్రెస్ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.


