సిరిపుర్ వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం పాక్స్ చైర్మన్ అంజి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సహకార సంఘ భవనం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గత సంవత్సర ఆదాయ, వ్యయాలను సహకార సంఘ సభ్యులకు వివరించారు. ఈ సందర్బంగా డిపాజిటర్లు తమ ఆవేదనను తెలిపారు. తమ డిపాజిట్ సొమ్మును త్వరగా చెల్లించాలని, మాజీ సీఈఓ వద్ద డబ్బులు రికవరీ చేసి డిపాజిట్ దారులకు, సహకార సంఘ సంస్థను కాపాడాలని చైర్మన్ ను కోరారు.
ఈ సందర్బంగా సిరిపుర్ పాక్స్ చైర్మన్ అంజి రెడ్డి మాట్లాడుతూ రైతులు, డిపాజిట్ దారులు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరి డిపాజిట్ పైసలు వారికి చెల్లిస్తామని, అవసరం అయితే సహకార సంఘ ఆస్తులు అమ్మైనా డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. అలాగే సంఘ సభ్యుల కోరిక మేరకు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను లోన్ రికవరీ డబ్బులు వసూలు చేసేందుకు ఉపయోగిస్తామని, రైతులు లోన్ లు సక్రమంగా కట్టాలని, సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ రైతులని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిపుర్ పాక్స్ వైస్ చైర్మన్, డైరెక్టర్ లు, రైతులు పాల్గొన్నారు.