Thursday, April 18, 2024
Homeనేరాలు-ఘోరాలుMallapur: గంజాయి పట్టివేత

Mallapur: గంజాయి పట్టివేత

నిందితుల్లో మైనర్ బాలుడు కూడా..

ఓబులాపూర్ చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో గంజాయి పట్టుకున్నట్లు డి ఎస్పి ఉమా మహేశ్వర్ రావు తెలిపారు. మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ శుక్రవారం మెట్ పల్లి సీఐ నవీన్, మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ చేపట్టిన తనిఖిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాంపెల్లి రాజేశ్వర్ రావు, మైనర్ బాలురు కలిసి బైక్ పై తరలిస్తున్న 200 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి పట్టుకున్న సీఐ నవీన్, ఎస్సై కిరణ్ కుమార్, కానిస్టేబుల్ లను డిఎస్పి అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News