జగిత్యాల -నిర్మల్ సరిహద్దు గ్రామమైన ఓబులాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను అదనపు ఎస్పీ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించటంలో చెక్ పోస్టులు కీలకపాత్ర పోషిస్తాయని, జిల్లా బార్డర్ లో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా బోర్డర్ చెక్ పోస్టులను పకడ్బందీగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోకి అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను రాకుండా, వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్యవేక్షణలో చెక్ పోస్టును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలు తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి సీఐ నవీన్ కుమార్, మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్, మల్లాపూర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.