Saturday, November 23, 2024
HomeతెలంగాణMallapur: శాసనసభ బరిలో..రైతు బిడ్డ

Mallapur: శాసనసభ బరిలో..రైతు బిడ్డ

వ్యవసాయం, వ్యాపారం, రాజకీయాలు, అంచెలంచెలుగా ఎదిగిన శ్రీనివాస్ రెడ్డి

గ్రామీణ ప్రాంతమైన పెద్దాపూర్ గ్రామంలో జన్మించి.. రైతుగా వ్యవసాయం చేసి .. వ్యాపార రంగంలో రాణిస్తూ నియోజకవర్గంలో ప్రముఖ రాజకీయ వేత్తగా ఎదిగారు కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి. మెట్ పల్లి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో పెద్దాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి..ప్రస్తుతం మెట్పల్లి జడ్పీటీసీగా శ్రీనివాస్ రెడ్డి భార్య కొనసాగుతున్నారు. గతంలో పెద్దాపూర్ సర్పంచ్ గా చేసారు. 2019లో టీఆర్ఎస్ తరుపున జడ్పీటీసీగా శ్రీనివాస్ రెడ్డి భార్య పోటీచేసి గెలుపొందారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీతో విబేధించి 2022లో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులలో ఒకరుగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అండదండలు ఉండి రాబోవు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు సిద్దమయ్యారు..

- Advertisement -

శ్రీనివాస్ రెడ్డి నేపథ్యం :-

కాటిపెల్లి గంగారెడ్డి -రామవ్వల కుమారుడు శ్రీనివాస్ రెడ్డి 1977 లో జన్మించారు.. నాల్గవ తరగతి వరకు ఊరిలో, ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో చదివి మంచి ఉత్తిర్ణత సాధించారు. ఇంటర్ కోరుట్లలో పూర్తి చేసారు. అనంతరం చదువు మానేసి వ్యవసాయం చేసారు. కోరుట్లలో పాలు అమ్మారు..పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించి అందులో మంచి సక్సెస్ సాధించారు. అప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపారు.

రాజకీయ నేపథ్యం

వ్యవసాయం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి రాజకీయాలపై ఆసక్తి నెలకొంది 1998 లో టీడీపీలో చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు.. వ్యవసాయం చేస్తూ, కోరుట్ల పట్టణంలో పాలు అమ్ముతు.. రాజకీయాలపై ద్రుష్టి సారించారు 2010 దాకా పాల వ్యాపారం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు.. టీడీపీ రాజీనామా చేసి టీఆర్ఎస్తె లో జాయిన్ అయ్యారు… తెలంగాణ ఏర్పడ్డాక 2013లో వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ తనకు కలిసి రాకపోవడంతో సర్పంచ్ ఎన్నికల్లో అయన భార్య రాధని బరిలో నిలిపి విజయం సాధించారు. 2018 వరకు సర్పంచ్ గా రాధ పనిచేసి గ్రామన్ని అభివృద్ధి చేసారు.. తదనంతరం వచ్చిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి భార్య రాధకి అవకాశం కల్పించారు.. ఆ ఎన్నికల్లో మంచి మెజారిటీతో రాధ గెలుపొంది జడ్పీటీసీ అయ్యారు… జడ్పీటీసీ నిధులతో మండల అభివృద్ధి చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు, షుగర్ ఫ్యాక్టరీ విషయాన్ని పట్టించుకోకపోవడం, రాష్ట్రంలో, నియోజకవర్గంలో దొరల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గులాబీ గూడు వీడి జడ్పీటీసీ రాధ -శ్రీనివాస్ రెడ్డి బయటకు వచ్చారు..

కాంగ్రెస్ లో చేరిక

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో 2022 లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసారు.. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో పట్ల ఆకర్షతులై , అలాగే రేవంత్ రెడ్డి మిత్రుల ద్వారా తనకున్న అనుబంధంతో, తన అభిమానుల నిర్ణయం ప్రకారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు..

అధిష్టానం అండదండలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత, రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ ఎంపి మధు యాస్కి ల తో తనకున్నా అనుబంధం, రేవంత్ రెడ్డి తో సాన్నిహిత్యం, అధికారంలో ఉన్న పార్టీ వదిలి ప్రతిపక్ష పార్టీలో చేరడం, బలమైన రెడ్డి వర్గ నేత కావడంతో పార్టీ అండదండలు తనకే ఉన్నాయని, పార్టీ తనకే టికెట్ ఇస్తుందని శ్రీనివాస్ రెడ్డి ఆశభావం వ్యక్తం చేసారు… రాబోయే ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు పై పోటీ చేసి గెలుస్తానని శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే రైతులకు, బడుగు బలహీన వర్గాలకు చెందినవారు అభివృద్ధి చెందుతారని, కాంగ్రెస్ పార్టీతోనే షుగర్ ఫ్యాక్టరీ కారణము అవుతుందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తుందని, పెన్షన్ ఉన్న ప్రతి వారికి 4000 రూపాయలు ఇస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని
శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కలిసొచ్చే అంశాలు

బలమైన రెడ్డి సామజిక వర్గ నేత కావడం, అధికార పార్టీ వదిలి కాంగ్రెస్ లో చేరడం, రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధం, జీవన్ రెడ్డి, మధు యాష్కి, లక్ష్మణ్ కుమార్ అండ, రైతు నాయకుడు కావడం కలిసి వచ్చే అంశాలు.

ప్రతికూలంశాలు

పార్టీలో వర్గ పోరు… నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం తో కార్యకర్తలు అయోమయంలో పడటం, పార్టీలో కొత్త నేత కావడం, నియోజకవర్గంలో ప్రజలందరికి తెలియకవడం ప్రతికూల అంశాలుగా మరే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండదండలతో టికెట్ లభించిన కాంగ్రెస్ పార్టీ లోని వర్గ విభేదాలతో శ్రీనివాస్ రెడ్డి నెగ్గుకవస్తారో.. అందరిని కలుపుకొని పోతారో.. లేక.. వర్గాపోరు వల్ల నష్టపోతారో రాబోయే ఎన్నికల్లో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News