Tuesday, September 24, 2024
HomeతెలంగాణMallapur: దిష్టి బొమ్మ దహనం

Mallapur: దిష్టి బొమ్మ దహనం

దిష్టి బొమ్మ దహనం చేసి జాతీయ రహదారి రాస్తా రోకో

కోరుట్ల పట్టణంలో కొత్త బస్టాండ్ అంబేద్కర్ కూడలిలో తెలంగా ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు కోరుట్ల టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, దశాబ్ది దగా నిరసన కార్యక్రమం రాష్ట్ర కోఆర్డినేటర్ అంజన్ కుమార్ ఆదేశాల మేరకు టీపీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్, రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణల అధ్యక్షతన కెసిఆర్ 10 హామీల 10 తలకాయల దిష్టి బొమ్మ దహనం చేసి జాతీయ రహదారి రాస్తా రోకో చేసారు. తదనంతరం ఆర్డివోకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా వెంటనే జరిగిన ఎన్నికల హామీలు 9 సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలు ఇప్పటికి హామీలుగానే ఉన్నాయి తప్ప అమలు కాలేదని, మొదటి ముఖ్య మంత్రి దళితుణ్ణి చేస్తా అని దగా చేసారని దళితులకు 3 ఏకరల భూమి, మైనారిటీ లకు, గిరిజనులకు గెలిచిన 4 నెలల్లో 12% రిజర్వేషన్ ఇస్తామని, ఇప్పటికీ ఆ ఊసే లేదని, రైతులకు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని,వారి కుటుంబంలో నిరుద్యోగులు లేకుండా చూసుకొని, యువతని రోడ్దుపాలు చేసారని, ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతం రాయొచ్చని స్థానిక కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పట్టణ మైనారిటీ అధ్యక్షుడు రజియోద్దీన్, మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు కుతుభిద్ధీన్, ఫీసర్ మెన్ మండల అధ్యక్షుడు బాధా విజయ్, తుకారం, రహీం, జలిన్, ఫక్రుద్దీన్, రహీం పాషా, కన్నెనరేశ్, కళ్ళేడా గంగాధర్, ఏళ్ల రాజు, సుజ్జి, లక్ష్మీ నర్సయ్య, ప్రసాద్, బైండ్ల శ్రీకాంత్, సాగర్, జఫార్, ఇమ్రాన్, బద్దం సుధాకర్, మామిడి రాజశేఖర్, లోక ప్రతాప్, కొమ్ముల చిన్న రెడ్డి, ఇప్పపల్లి గణేష్, గోపిడి నరేశ్, భూమానందం, ముద్దం ప్రశాంత్, భారత్, రాజ్ కుమార్, శాజల్, సూఫీయాన్, శ్రీకాంత్, రాములు, జలపతి, పాల్రెడ్డి, మహేష్, రమేష్, గంగాధర్, రాజేష్, శేఖర్, శ్రీనివాస్, సలీమ్, అఫ్జల్, చంద్, గౌతమ్, అఫ్జల్, ఫెరోజ్, వాసిద్, తహ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News