Tuesday, October 1, 2024
HomeతెలంగాణMallapur: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రైతు బిడ్డలు

Mallapur: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రైతు బిడ్డలు

డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి ఉద్యోగం పొందిన నడికూడ గ్రామ యువతులు

డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండలంలోని నడికుడ గ్రామానికి చెందిన కొరిపెల్లి నివేదిత, కొరిపెల్లి ప్రజ్ఞ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. కొరిపల్లి నర్సారెడ్డి ,రవీందర్ రెడ్డి అన్నదమ్ములు, వీరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అన్నదమ్ముల్ల కూతుళ్ళు అయిన నివేదిత, ప్రజ్ఞలు మెట్పల్లిలోని ఆదర్శ విద్యాలయంలో పదవ తరగతి వరకు చదివి, సరళ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు.

- Advertisement -

పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం పొందారు. కొరిపెల్లి నివేదిత జిల్లాలో మూడో ర్యాంకు సాధించింది , కొరిపెల్లి ప్రజ్ఞ 77 ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం పొందడం వల్ల తల్లిదండ్రులు సంబరాలు మునిగి తేలుతున్నారు, తమ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక రావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇద్దరికీ అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News