Sunday, July 7, 2024
HomeతెలంగాణMallapur: దశాబ్ది ఉత్సవాలు ఓవైపు… రైతుల నిరసన ఇంకో వైపు

Mallapur: దశాబ్ది ఉత్సవాలు ఓవైపు… రైతుల నిరసన ఇంకో వైపు

పై అధికారులతో మాట్లాడిన విషయాన్ని రైతుకు చెప్పి, ఎస్సై విజ్ఞప్తి చేశాక కమాన్ దిగి నిరసన విరమించిన రైతు

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మిల్లుకి పోయి నెల రోజులు దాటినా ఇంకా డబ్బులు పడటం లేదని ఆగ్రహం తో కొత్త ధాంరాజ్ పల్లి రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేశారు. గంటన్నర పాటు నిరసన చేయడంతో జగిత్యాల -నిర్మల్ రహదారి పై రాకపోకలకు అంతరాయము కలిగింది. దశాబ్ది ఉత్సవాలకు డబ్బులు ఉంటాయి కానీ రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరిట లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని రైతులు పండించిన పంటను మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

పన్నాల నారాయణరెడ్డి అనే రైతు ఆగ్రహంతో కమాన్ పైకి ఎక్కి మందు డబ్బాతో నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి స్థానిక తహసిల్దార్ రవీందర్ ఎస్సై నవీన్ కుమార్ చేరుకొని రైతులతో మాట్లాడారు. నెల రోజులైనా డబ్బులు పడటం లేదని, రాబోయే వర్షాకాలని విత్తనాలకు, ఎరువులకు డబ్బులు ఎలా అని తహసీల్దార్ ను రైతులు ప్రశ్నించారు.. ఇప్పటికే బస్తాకు 3 కిలోలు నష్టపోయమని, ధాన్యం మిల్లుకు పోయి నెల దాటినా ఇంకా డబ్బులు ఖాతాల్లో పడటం లేదని తహసీల్దార్, ఎస్సైకి తెలిపారు. రైతులు వినకపోగా తహసీల్దార్ పై అధికారులతో మాట్లాడారు..నాలుగైదు రోజుల్లో డబ్బులు పడుతాయని నిరసన విరమించాలని రైతులను తహసీల్దార్ కోరారు. పై అధికారులతో మాట్లాడిన విషయాన్ని రైతుకు చెప్పటంతో ఎస్సై విజ్ఞప్తితో రైతు కమాన్ దిగి నిరసన విరమించాడు..

పోలీసుల విజ్ఞప్తి తో రోడ్డుపై బైటయించిన రైతులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్దరించారు. ఈ నిరసనలో నారాయణ రెడ్డి, లింగా రెడ్డి, సుధాకర్, వినోద్, శ్రీనివాస్, రాజరెడ్డి, రాజేందర్, రాజం, ప్రతాప్ రమేష్ తదితర రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News