Saturday, November 23, 2024
HomeతెలంగాణMallapur: నిర్భంధాలతో కాంగ్రెస్ లోకి చేరికలు ఆపలేరు

Mallapur: నిర్భంధాలతో కాంగ్రెస్ లోకి చేరికలు ఆపలేరు

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింగారావు

కోరుట్ల నియోజకవర్గంలో అధికార పార్టీకి షాక్ తగిలింది. ముత్యంపేట గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులతో పాటు వందలాది మంది అధికార పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నో ఏళ్లుగా బీ ఆర్ఎస్ లో కొనసాగుతున్న తమకు ప్రాధాన్యం లేదని ఉప సర్పంచ్ మహేష్ రెడ్డి, నియోజకవర్గ యువ నేత బొల్లం రఘుల ఆధ్వర్యంలో బీ ఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగ రావు సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగ రావు మాట్లాడుతూ అధికార టిఆర్ఎస్ పార్టీ పతనం ముత్యంపేట నుంచి ప్రారంభమైందని, బీఆర్ఎస్ నేతలు ప్రలోభాలు చేసినా గానీ ప్రలోభాలకు లొంగకుండా బీఆర్యస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. యువతకు నాయకులకు డబ్బుతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని, బీఆర్ఎస్ను వీడకుండా నిర్బంధిస్తున్నారని అయినా ప్రలోభాలకు లొంగకుండా నిర్బంధాన్ని దాటుకొని వందలాది కార్యకర్తలు కాంగ్రెస్ లోకి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్ రావు అభివృద్ధి చేసింది శూన్యమని, కొడుకు రాజకీయ రంగ ప్రవేశం కోసం ప్రయత్నలు చాలా చేసాడు కానీ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని అన్నారు. గల్ఫ్ కార్మికుల తిరిగి రండి ఉద్యోగాలు ఇస్తున్నామని మాయమాటలు చెబుతున్నారని చక్కెర కర్మాగారం కార్మికుల ఉద్యోగులు రోడ్డున పడ్డారని వారికి లేని ఉద్యోగాలు కొత్తగా గల్ఫ్ కార్మికులకు ఇస్తామనటం సిగ్గుచేటని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఆరు గ్యారెంటీ హామీలను తప్పకుండా నెరవేరుస్తామని అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని, వారికి 500 బోనస్ ఇస్తామని అన్నారు. మహిళలకు అభ్యున్నతి కోసం కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ అని, మహిళలకు అండగా ఉంటామని, తన తండ్రి రత్నాకర్ రావు చేసిన సేవలు మరువలేవని, ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు వాకిటి సత్యం రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఎలాల జలపతి రెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్ రెడ్డి, మంజుల లక్ష్మా రెడ్డి, సత్తమ్మ మల్లయ్య, నాయకులు బాపు రెడ్డి, కోటగిరి ఆనంద్, తోట సంతోష్, యూత్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News