Friday, November 22, 2024
Homeతెలంగాణచెరువు, శిఖం భూమి ప్రజాసేవ కోసమే కబ్జా చేశా

చెరువు, శిఖం భూమి ప్రజాసేవ కోసమే కబ్జా చేశా

నువ్వా నాపై ఆరోపణలు చేసేది?

పట్టణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాలువ డిజైన్ కు సిద్ధపడాలని, చేర్యాల మత్తడి భూమిని ఆక్రమించేసి ప్రజా సేవ కోసం కబ్జా చేశానని అంటూనే ఆరోపణ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మరితో పాటు ప్రతిపక్ష పార్టీలకు పట్టణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాలువ డిజైన్ చేయడానికి వారం రోజుల్లో ముందుకు రావాలని డెడ్లైన్ విధించారు. మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట వద్ద కాలువ నిర్మాణం పనులను పరిశీలించిన అనంతరం మడేల్అయ్యా గుడి అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి 33 ఎకరాలు వెంచర్ చేసి గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన 10% భూమిని అమ్ముకున్నది నీవే కదా అని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నీవు నా బిడ్డ మాదిరిగా చేర్యాల మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన 20వేల గజాల స్థలాన్ని ఇచ్చి నిజాయితీ చాటుకుంటే మంచిది అన్నారు. పర్మిషన్ కోసం కోటి 20 లక్షలు ఇవ్వాలని నా ముందు మోకరిల్లినది నువ్వా నన్ను విమర్శించేది అన్నారు. వారం రోజుల్లో చేర్యాల పట్టణ ప్రజల ప్రయోజనాల కోసం కాలువ నిర్మాణం డిజైన్ రూపొందించాలని వ్యక్తిగా గుర్తిస్తామని అన్నారు. ఇప్పటికైనా కాలువ నిర్మాణం కోసం కొంత పని జరిగిందని కోసం మూడు కోట్ల నిధులను తీసుకువచ్చానని నష్టం జరగకుండా పనులు చేసే విధంగా సహకరించాలని కోరారు. ఉద్యమ కాలం నుంచి తెలంగాణ కోసం పనిచేస్తున్న నా గురించి ఆరోపణలు మాని ప్రజాక్షేత్రంలో నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలని సూచించారు. దళిత మహిళలు మా భూముల గుండా కాల్వ తీయవద్దని ఎమ్మెల్యేను వేడుకలు ఉన్న పార్టీ కొద్ది స్థలాన్ని కాలువలో పోతే మాకు జీవనోపాధి లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్ వైస్ చైర్మన్ పి వెంకట్ రెడ్డి కౌన్సిలర్లు మంగోల్ చంటి నరేందర్ కనకవ్వ యాదగిరి పచిమట్ల సతీష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు బాల నరసయ్య కే శ్రీధర్ రెడ్డి ఎం నాగేశ్వరరావు టి సంజీవులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News