మల్లాపూర్ మండల నూతన తహసీల్దార్ గా లకావత్ వీర్ సింగ్ ను జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా నియమించారు. నూతన తహసీల్దార్ గా వీర్ సింగ్ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా నూతన తహసీల్దార్ మాట్లాడుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని, భూ సమస్యలపై ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వీర్ సింగ్ ను డిప్యుటీ తహసీల్దార్ శ్రావణి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.