Friday, November 22, 2024
HomeతెలంగాణMallapur: డిసెంబర్ లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తాం

Mallapur: డిసెంబర్ లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తాం

ఇచ్చిన మాట నిలుపుకుంటాం

ఎన్నికలలో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామని, మేనిపెస్టోలో పొందుపర్చిన చక్కెర కర్మాగారాలను తప్పకుండ పునః ప్రారంభిస్తామని ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ముత్యంపేట షుగర్ ప్యాక్టరీని పునరుద్దరణ కమిటీ పరిశీలించింది. అనంతరం ప్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతులతో చర్చా వేదిక కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా ప్యాక్టరీ కోసం రైతులు చేసిన పోరాటాలు, నిరసనలు చాలా ఉన్నాయని కాంగ్రెస్ మేనిపెస్టోలో పెట్టిన అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చతుందని, ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల లోపే కమిటీ ఏర్పాటు చేసిందని, ప్రజా ప్రభుత్వంలో ప్యాక్టరీల పునరుద్దరణ జరుగుతుందని తెలిపారు. టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు మాట్లాడుతూ ప్యాక్టరీ పునః ప్రారంభంతో అనేకమందికి ఉపాధి లభిస్తుందని ప్రజా ప్రభుత్వం తొందరగా ప్యాక్టరీని ప్రారంభించాలని కోరారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగా రావు మాట్లాడుతూ ప్యాక్టరీ ప్రారంభం కోసం అనేక ఉద్యమాలు చేశామని, రైతుల పోరాట ఫలితం తొందరలోనే నెరవేరుతుందని అన్నారు. రాష్ట్ర సీనియర్ నాయకులు కరంచంద్ మాట్లాడుతూ స్వర్గీయ కొమిరెడ్డి రాములు ఫ్యాక్టరీ కోసం చాలా కష్టపడ్డాడని, ఆయన కోరిక త్వరలోనే నెరవేరే సమయం వచ్చిందని, ఫ్యాక్టరీ ప్రారంభంతో అనేకమందికి ఉపాధి లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్యాక్టరీ ప్రారంభం కోసం మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల అభ్యున్నతి కోసం కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతు ప్రజలు తమను నమ్మి అధికారాన్ని ఇచ్చారని, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నేరవేర్చుతామని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు అమలు చేశామని, మిగితా రెండు హామీలు కూడా తొందరలోనే అమలు చేస్తామని అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని, చక్కర కర్మాగారాలను పరిశీలించి అధ్యయన కమిటీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తొందర్లోనే చేరవేరుస్తామని, ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామని, రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని, ఇక్కడి ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధి కలుగుతుందని ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి అన్నారు.

ఫ్యాక్టరీ ఏర్పాటు, పునః ప్రారంభం కోసం పోరాటం చేసిన మాజీ ఎమ్మెల్యేలు స్వర్గీయ వెంకటేశ్వర్ రావు, జువ్వాడి రత్నాకర్ రావు, కొమిరెడ్డి రాములుల విగ్రహాలను ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తొందరలోనే శుభవార్త వింటారని అన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభం కోసం దీక్ష చేస్తున్న నారాయణ రెడ్డికి మంత్రి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే లు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, భూపతి రెడ్డి, డా. సంజయ్ కుమార్, కలెక్టర్ యాస్మిన్ బాషా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కృష్ణ రావ్, కిసాన్ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి, రైతు నాయకులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News