సామాజిక సేవలో ముందుండే చెన్నమనేని శ్రీనివాసరావు పేదింటి అమ్మాయి వివాహానికి అండగా నిలిచారు. కొత్త దామరాజ్ పల్లి గ్రామానికి చెందిన ఇల్లెందుల రాజేశం పేద కుటుంబానికి చెందినవారు. అతని పెద్ద కూతురు వివాహం జూన్ ఒకటవ తేదీన నిశ్చయించారు. అమ్మాయి వివాహానికి ఆర్థిక స్తోమత లేక సతమతమవుతున్నాడు. రాజేశం పెద్ద కూతురు రాజేశ్వరి వివాహానికి టిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాసరావు లత దంపతులు పెళ్లి బట్టలతో పాటు 20 వేల నగదు పెళ్లికూతురుకు అందించారు. పెళ్లికి అండగా నిలుస్తున్న సి ఎస్ ఆర్ కు పెళ్లికూతురు కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావు, సర్పంచ్, ఎంపీపీ, ఉప సర్పంచ్, గ్రామ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు