Friday, November 22, 2024
HomeతెలంగాణMallareddy: నిరుపేదలందరికీ నీడ

Mallareddy: నిరుపేదలందరికీ నీడ

ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాతరలా సాగుతోంది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల పంపిణీ పూర్తి చేసిన ప్రభుత్వం, నేడు రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేసింది. మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గ 1000 మందికి మంత్రి చామకుర మల్లారెడ్డి చేతుల మీదగా అలాట్మెంట్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల సాకరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అన్ని వసతులతో కట్టించి పంపిణీ చేశామన్నారు. ఇలాంటివి దేశంలో ఎక్కడా కూడా చేపట్టలేదని మంత్రి అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, ఆర్డీవో రాజేష్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News