Sunday, October 6, 2024
HomeతెలంగాణManakonduru: రేషన్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి

Manakonduru: రేషన్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి

విస్తృతంగా పర్యటిస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని తీర్చే పనుల్లో బిజీగా ఉన్న రసమయి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో నూతన రేషన్ షాప్ ను ప్రారంభించి, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కళ్యాణలక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసి, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ ఆరెల్లి వనజ- వెంకటేష్ దంపతులు ఎమ్మెల్యే బాలకిషన్ ను శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. అనంతరం తిమ్మాపూర్-పోరండ్ల గ్రామాల మధ్యలో ఇటీవల నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను రసమయి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రెడ్డి త్రివేణి- తిరుపతిరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగల ఏకానందం, ఆశోద శ్రీనివాస్, తహ సిల్దార్ కే. కనకయ్య, రేషన్ డీలర్ ఆరెల్లి వనజ- వెంకటేష్ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News