ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని.. మీ భద్రతే మా బాధ్యత అంటూ.. మంచిర్యాల పోలీసులు తమ మంచితనాన్ని చాటుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పోలీస్ జోన్ దేవాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలు మద్దిమాడ, రాంపూర్, ఘడ్ పూర్ లో దేవాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో “పోలీస్ మీకోసం-కమ్యూనిటీ పోలీసింగ్” కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 120మంది వృద్ధులకు, మహిళలకు సేవా భావంతో దుప్పట్లను ఎస్ఐ విజేందర్ అందచేశారు.
గ్రామ సమస్యలు, మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని..ఈసందర్బంగా ఎస్ఐ విజేందర్ గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ అధికారులకు దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాపుర్ పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.