Saturday, October 5, 2024
HomeతెలంగాణManchireddy: కేసీఆర్ సర్కారులో మహిళలే మహారాణులు

Manchireddy: కేసీఆర్ సర్కారులో మహిళలే మహారాణులు

మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడ జేఎంఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన మహిళా సంక్షేమ ఉత్సవాలులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారిని మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ద్వారా పొందుతున్న పథకాలు (ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆసరా పింఛను, కళ్యాణ లక్ష్మీ మొదలైనవి) గురించి వివరించి సభాముఖంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా తెలంగాణ మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి ముందుండడంలో రోల్ మోడల్ గా నిలిచిందని, గత 9సంవత్సరాల ప్రయాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో రాష్ట్రంలో అనేక పథకాలు మహిళా సంక్షేమం కోసం అమలు చేయడం ద్వారా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ఆన్నారు. అనంతరం 22,29,00,000/- రూపాయల విలువచేసిన బ్యాంకు లింకేజీ చెక్కును స్వయం సహాయక సంఘాలకు, కేసీఆర్ కిట్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు మొదలైనవి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News