ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 3వ తేదీన నిర్వహించే రైతు దినోత్సవ కార్యక్రమాలపై వ్యవసాయ అధికారులు, రైతుబంధు కోఆర్డినేటర్లతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా కర్షకులతో సహపంక్తి భోజనాలు, ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఏడీఓ సత్యనారాయణ, మండల కోఆర్డినేటర్లు, ఏఓ, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.