Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: సిఐటియు రాష్ట్ర 16వ మహాసభలు

Manchiryala: సిఐటియు రాష్ట్ర 16వ మహాసభలు

రామకృష్ణాపూర్ సిఐటియు కార్యాలయంలో సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) 16వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. గోదావరిఖనిలోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజులపాటు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కామ్రేడ్స్ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్.వెంకటస్వామి ఈ సందర్బంగా మాట్లాడుతూ… మహాసభలకి రాష్ట్ర నాయకులు సింగరేణి నాయకులు హాజరు కానున్నారు, ఈ మహాసభల్లో ప్రధానమైన ముఖ్యంశాలపై తీర్మానాలు జరుగుతాయని, ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇచ్చే విధంగా హెచ్ఆర్ఏ మున్సిపల్ ప్రకారంగా చెల్లించే విధంగా తీర్మానాలు పెట్టబోతున్నాము కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.రామస్వామి రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఐలయ్య కోశాధికారి అలవాల సంజీవ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ సంఖ్య వెంకటేష్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News