ఈనెల 30వ తేదీన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన భవన్ లో జరిగే బీసీ లాయర్ల మహాసభకు మంచిర్యాల జిల్లాలోని వివిధ కోర్టులో పనిచేసే బీసీ లాయర్లు పెద్దఎత్తున సభకు తరలివచ్చి జయప్రదం చేయాలని బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంచిర్యాల న్యాయవాదులు కొత్త సత్తయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్త సత్తయ్య మాట్లాడుతూ… దేశ జనాభాలో 60 శాతం బీసీ జనాభా ఉంటే న్యాయవ్యవస్థలో బీసీల శాతం కేవలం రెండు శాతం మాత్రమే, అంటే ఈ ప్రభుత్వాలకు బీసీల పట్ల ఎంత వివక్షత అవలంబిస్తుందో అనడానికి ఇదే ఉదాహరణ. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 690 మంది జడ్జీలు పనిచేసి రిటైర్డ్ అయిన వారిలో అందులో ఒక్కరు కూడా బీసీలు లేరు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది జడ్జీలు ఉంటే బీసీ జనాభా ప్రాతిపదికన 17 మంది బిసి జడ్జిలు ఉండాలి. కానీ ఆ పరిస్థితి కొనసాగడం లేదు. అలాగే బీసీ లాయర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికై చర్చించి రాబోయే రోజుల్లో ఉద్యమాలు కార్యచరణ ఉంటుందన్నారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని బీసీ లాయర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఆర్ఆర్ రాములు, రంగు మల్లేష్, గడప ఉమేష్, కోట మల్లయ్య, బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్, కో కన్వీనర్ సంఘం లక్ష్మణ్, న్యాయవాదులు, ముల్కల కనకయ్య, వడ్నాల సత్యనారాయణ, అగల్ డ్యూటీ సత్యనారాయణ, కొట్టే తిరుపతి, విజేందర్, ఉదయ్, మల్లేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.