Saturday, October 5, 2024
Homeతెలంగాణభట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు భారీ స్పందన

భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు భారీ స్పందన

బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండో రోజు సీఎల్పీ నేత మల్లు భట్టీ విక్రమార్క పీపుల్స్ మార్చ్ మొదలు పెట్టారు. నియోజకవర్గంలోని ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి భారీ స్పందన వస్తోంది. కేంద్రంలోని బిజెపి పార్టీ మోదీ, రాష్ట్రంలో బిఆరెస్ పార్టీ కేసీఆర్ ల నియంతల పోకడలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా వారి గోస వెళ్లబుచ్చుకుంటున్నారని భట్టీ అన్నారు.

- Advertisement -

బెల్లంపల్లి ఎంసీ గ్రౌండ్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ను చేపట్టారు. ఏఎంసీ గ్రౌండ్ నుంచి మొదలైన పాదయాత్ర పలు మండలంలోని తాళ్ల గురజాల, బట్వాన్ పల్లి, పెరికపల్లి గ్రామాలలో సాగింది. సింగరేణి కార్మికులు బొగ్గు గనుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించి పాదయాత్రలో పాల్గొన్నారు. మండలంలోని ఎల్లమ్మ గుడి ప్రాంతంలో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కళాశాలల భవనాలు సౌకర్యంగా లేవని, స్కాలర్షిప్ కూడా సరిగ్గా రావడం లేదని తెలుపుతూ వినతిపత్రం అందజేశారు. కళాశాలకు హాస్టల్ భవనం రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని, ప్రతిరోజూ నడుచుకుంటూ వస్తున్నామని విద్యార్థులు వారి గోడును వినిపించారు. కళాశాలకు అందుబాటులోనే హాస్టల్ భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థులు కళాశాలలో చదువుతున్న సరైన టాయిలెట్లు లేవని, ల్యాబ్ సౌకర్యం లేదు, ఆటస్థలం లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు బస్సు సౌకర్యాలు లేకపోలేదన్నారు. కళాశాలలో కనీసం తాగునీటి వసతి కూడా సరిగా లేదని వివరించారు.

భట్టి విక్రమార్కకు అంతేకాకుండా బెల్లంపల్లిలోనే పీజీ కాలేజ్ ఏర్పాటు చేయాలని భట్టికి విద్యార్థునులు వినతి పత్రం అందజేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక విద్య, వైద్యానికి నిధులు కల్పించడం లేదు, కొత్త కళాశాలలు నిర్మించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హాయంలోనే హైదరాబాద్ ఐఐటీ, త్రిబుల్ ఐటీలు, కొత్త కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తానని భట్టి విక్రమార్క విద్యార్థులకు హామీ ఇచ్చారు. పీపుల్స్ మార్చ్ కు గ్రామాల్లో ప్రజలు నీరజనాలు పలికారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు నేరుగా బట్టి విక్రమార్కకు విన్నవించారు. తాగునీరు రహదారులు కనీస వసతులు లేవని మొరపెట్టుకున్నారు. ఈ పాదయాత్రలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ నాయకులు చిలుముల శంకర్, నాతరి స్వామి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ మెన్ తొంగల మల్లేష్, సూరిబాబు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News