Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: 22న జిల్లా కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

Manchiryala: 22న జిల్లా కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని చార్వక హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐకేపీ వీవోఏ జిల్లా గౌరవ అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బ్రతుకులు బాగుపడుతాయనుకుంటే గ్రేడింగ్ విధానంతో పని భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల్లో పని చేసే వీవోఏలు అందరు నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబలకు చెందిన వారే ఉన్నారు. అందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని ఆర్థికంగా, సామజికంగా అభివృద్ధికి తొడ్పాడే వీవోఏల పట్ల ప్రభుత్వ విధానాలు విడనడాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. అర్హులైన వీవోఏలను సీసీ లుగా ప్రమోట్ చేయాలని తదితర సమస్యలు పరిష్కరించే విదంగా, ప్రభుత్వం సమ్మె విరామింప చేయాలని లేని యెడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం, ఈ పోరాటం ద్వారా చెప్తామని డిమాండ్ చేస్తున్నాం, ఈ సమావేశంలో దాసరి సురేష్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, శ్యామల పశు మిత్ర వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు.
భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగింది.మే 11 న ఏమ్మెల్యేలకు వినతిపత్రాలు, 12 న ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పోస్ట్ కార్డు క్యాంపేయిన్ ఉత్తరాలు రాయాలి,14 న వీవోఏ కుటుంబ సభ్యులతో నీరసన చేయాలి. 15,16న ఏపీఎం ఆఫీస్ ల ముందు సామూహిక దీక్షలు చేయాలి. 18 న మహిళా సమైక్య సభ్యులతో ప్రదర్శన అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలు, ర్యాలీ. 21 న డివిజన్ కేంద్రాల్లో బతుకమ్మ ఆటలు, రాత్రి బస చేయాలి. 22న జిల్లా కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమంలో లింగంపల్లి వెంకటేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, కుంటాల కుమార్, దుర్గం రాములు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పొట్ట పోషం జిల్లా కోశాధికారి, జిల్లా ఉపాధ్యక్షులు
రమాదేవి, రజిత, అనిత, జిల్లా సహాయ కార్యదర్శులు పి.మహేష్, రజిత, సురేష్, జిల్లా సలహా దారులు జుమ్మిడి లక్ష్మణ్, దాసుజిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్, భాగ్యలక్ష్మి, గౌరీ, స్వరూపరాణి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News