Saturday, July 6, 2024
HomeతెలంగాణManchiryala: నిరంతర పర్యవేక్షణతో సమర్థవంతంగా ఎన్నికలు

Manchiryala: నిరంతర పర్యవేక్షణతో సమర్థవంతంగా ఎన్నికలు

మీ కంప్లైట్లు వీరికి తెలియజేయండి

మంచిర్యాల జిల్లాలోని 002 -చెన్నూర్ (ఎస్.సి.), 003-బెల్లంపల్లి (ఎస్.సి.), 004-మంచిర్యాల నియోజకవర్గాలలో జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కొరకు ఎన్నికల సాధారణ, ఖర్చుల పరిశీలకులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. 003-బెల్లంపల్లి, 004-మంచిర్యాల నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా బిశ్వజిత్ దత్తా ఐ.ఎ.ఎస్., మొబైల్ నం. 7780382020, 002-చెన్నూర్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా సజ్జన్.ఆర్. ఐఎఎస్., మొబైల్ నం. 8247623113, 002-చెన్నూర్, 003-బెల్లంపల్లి నియోజకవర్గ ఖర్చుల పరిశీలకులుగా అశోకుమార్ సత్తార్ ఐ.ఆర్.ఎస్., మొబైల్ నం. 8317650920, 004-మంచిర్యాల నియోజకవర్గ ఖర్చుల పరిశీలకులుగా సిఎస్. పవన్ ఐఆర్ఎస్, మొబైల్ నం. 8317669392 లను నియమించగా పరిశీలకులు జిల్లాలోని నస్పూర్ లో గల సింగరేణి అతిథి గృహంలో ఉంటారని, జిల్లా పోలీసు పరిశీలకులుగా నియమించబడిన ఆర్. ఇలాంగో ఐపిఎస్. మొబైల్ నం. 9497997900 జైపూర్ లోని ఎస్.టి.పి.పి. అతిథి గృహంలో ఉంటారని తెలిపారు.

- Advertisement -

ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార ఖర్చులను ఎన్నికల ఖర్చుల పరిశీలకులు, ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, శాంతి భద్రతల పర్యవేక్షణ, అనుమతులు, ఇతరత్రా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా ఐఎఎస్. మొబైల్ నం.7780382020 ఎన్నికల సంబంధిత
సందేహాల నివృత్తి, ఎన్నికల నిర్వహణలో సమస్యల పరిష్కారం కొరకు ఉదయం 10 గం.ల నుండి 11 గం.ల వరకు నస్పూర్ లోని సింగరేణి అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని, జిల్లా పోలీసు పరిశీలకులు ఆర్. ఇలాంగో ఐపీఎస్ మొబైల్ నం. 9497997900 శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థ సంబంధిత సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారం కొరకు జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని ఎస్.టి.పి.పి. అతిథి గృహంలో సాయంత్రం 4-5 గం.ల వరకు అందుబాటులో ఉంటారని, రాజకీయ పార్టీలు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News