Tuesday, September 17, 2024
HomeతెలంగాణManchiryala: వరిధాన్యం కొనుగోలు లక్ష్యం చేరాలి

Manchiryala: వరిధాన్యం కొనుగోలు లక్ష్యం చేరాలి

ప్రభుత్వం జిల్లాలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్ నాయక్, బి.రాహుల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్ లతో కలిసి జిల్లా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు, మంచిర్యాల రాజస్వ మండల అధికారి దాసరి వేణు, రైస్ మిల్లర్లతో వరిధాన్యం కొనుగోలు, రవాణా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం కలుగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వమే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు మద్దతు ధర చెల్లిస్తామన్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, రైస్మిల్లులకు కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా కల్లాలలో ధాన్యం లేకుండా చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు నిబంధనల మేరకు తప్ప, తాలు లేకుండా 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేలా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్మిల్లులకు తరలించిన ధాన్యాన్ని మిల్లుల యజమానులు త్వరగా దిగుమతి చేసుకొని వాహనాలను తిరిగి పంపించాలని, కాలయాపన చేసిన మిల్లులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇంకా కొనుగోలు చేయదగిన అంచనా లక్ష్యాలను రైస్ మిల్లర్లతో అనుసంధానమై త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని, వర్షాలు పడేలోగా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులు, రైస్మిల్లర్లు, లారీ ట్రాన్స్పోర్ట్ యజమానులు, పోలీసు, రవాణా శాఖల అధికారులు, సెక్టార్ ఏజెన్సీలు అందరు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. వానాకాలం సీజన్లో రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైసిమిల్లుల యజమానులు క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యాన్ని నిల్వ చేయడం, తరలించేందుకు అవసరమైన గన్నీ సంచులు సమకూర్చుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎక్కడా నిల్వ లేకుండా ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లులకు తరలించడంతో పాటు మిగిలిన ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించే లారీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలను మండలాల వారిగా కేటాయించాలని తెలిపారు. నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయని రైస్మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు అన్ని శాఖల సమన్వయంతో ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించి సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని, ఆయిల్పామ్ పంట వలన కలిగే లాభాలను వివరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎ.ప్రేమకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, ఎ.సి.పి. తిరుపతిరెడ్డి, రైస్మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్, ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News