‘హాథ్ సే హాత్ జోడో అభియన్’ కార్యక్రమం మంచిర్యాలలో ఘనంగా సాగుతోంది. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం పాదయాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ సురేఖ పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయాలు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపట్టిన పలు సేవా కార్యక్రమాల గురించి యాత్రలో వివరిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు ను ఎమ్మెల్యే గా గెలిపించి నియోజకవర్గంను అభివృద్ధి దిశగా చుండండి అంటూ పలకరిస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.