కేకే ఓసీపీ లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఫిట్ సెక్రటరీ మేడి రాజమల్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాజాగా జరిగిన 16వ మహాసభలలో యువ నాయకత్వానికి పెద్దపీట వేసామని అందులో భాగంగానే ఆరిఫ్ ను రాష్ట్ర కమిటీ సభ్యునిగా తీసుకున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అనంతరం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నాగరాజు గోపాల్ మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో చేసుకున్న అగ్రిమెంట్ల కంటే బొగ్గు గని కార్మికులకు చేసుకున్న 11వ వేతన ఒప్పందం మెరుగైన దేనిని అన్నారు. అగ్రిమెంట్ ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం పంపడం జరిగిందని అనుమతులు వచ్చిన వెంటనే అమలు జరుగుతుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోతే మళ్లీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని అన్నారు. వేతన ఒప్పందంలో సంతకాలు చేసి బయటికి వచ్చి విమర్శించడం ఏ విధంగా సరైనదని విమర్శించే నాయకులను ప్రశ్నించారు. కార్మికులుగా మనం పోరాటం చేసి వేతన ఒప్పందాన్ని అగ్రిమెంట్ చేసుకుంటే అధికారులు కూడా తమకు వేతనాలు పెంపుదలకు అనుమతులకు పంపారని ఫలితంగా అధికారుల వేతనాలు సైతం పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. భవిష్యత్తులో వేతన ఒప్పందాలు లేకుండా బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చిందని అది అమలు అయితే ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా వేతన ఒప్పందాలు జరగవని కార్మికులకు తెలియజేశారు. అనంతరం కేకే ఓసీపీ సమస్యలను ప్రస్తావిస్తూ అనుక్షణం రక్షణ గురించి చెప్పే చెప్పే యాజమాన్యం రోడ్డుపై దుమ్ము ఉన్న కూడా వాటర్ స్ప్రేయింగ్ చేయడం లేదని, సి.హెచ్.పి వరకు కార్మికులను తీసుకువెళ్లడమే కానీ షిఫ్ట్ అయిపోయాక తీసుకొని రావడం లేదని, సభా స్థలం వద్ద ఇప్పటి వరకు రేకుల షెడ్డు వేయాల్సి ఉండగా ఇంతవరకు ఎందుకు వేయలేదని విమర్శించారు. గత రెండు నెలలుగా షావెల్ పడిపోయిన కూడా దానిని పట్టించుకోవడంలేదని ఒకవేళ కార్మికులు చిన్న తప్పు చేస్తే శిక్షించే అధికారులు ఈ విషయంపై ఎందుకు దృష్టి సారించడం లేదని సంస్థకు కార్మికులు నష్టం చేసే పనులు చేయరని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి, కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు అలవాల సంజీవ్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అరిఫ్, శ్రీనివాస్, శ్రీధర్ కార్మికులు పాల్గొన్నారు.