Sunday, October 6, 2024
HomeతెలంగాణManchiryala: జర్నలిస్టులకు ఇళ్ళు, ఇండ్ల స్థలాల కోసం వినతి

Manchiryala: జర్నలిస్టులకు ఇళ్ళు, ఇండ్ల స్థలాల కోసం వినతి

మంచిర్యాల జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ళు, ఇండ్ల స్థలాలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రం కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, బిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ నారదాసు లక్ష్మణ్ లకు జిల్లా కమిటీ నాయకులు వారికి వినతిపత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు. క్యాతన్ పల్లి లోని విప్ బాల్క సుమన్ నివాసంలో వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తొట్ల మల్లేష్, గోపతి సత్తయ్యలు జర్నలిస్టలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో కీలకంగా వ్యవహరించిన జర్నలిస్టులు స్వ రాష్ట్రంలో ఇండ్లు, ఇళ్ళ స్థలాలు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం నుండి ఇల్లు, ఇళ్ళ స్థలాలు పొందేందుకు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. చాల మంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇల్లు లేక అద్దెఇళ్ళలో ఉంటూ ఇబ్బందులు ఎదురకొంటున్నారని పేర్కొన్నారు. జిల్లలో గత 15 సంవత్సరాలుగా ఇళ్ళ స్థలాలు మంజూరు చేయలేదని తెలిపారు.
అదేవిధంగా రైల్వే పాస్ పునరుద్ధరణకై చర్యలు తీసుకోవాలని కోరారు. బస్ పాస్, రైల్వే పాస్ రాయితీపై వంద శాతం రాయితీ కల్పించేలా కృషి చేయాలని కోరారు . జర్నలిస్టులు ఆర్టిసి బస్ పాస్ రాయితీని జర్నస్టు కుటుంబాలకు వర్తింపచేయాలని తెలిపారు. అదేవిదంగా జర్నలిస్టులకు టోల్ గెట్ ఫీజు నుండి మినహాయిపు ఇవ్వాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళా జర్నలిస్టులకు రాత్రిపుట బద్రత కల్పించడంతో పాటు, జర్నలిస్టులందరికి “జర్నలిస్టుబంధు” పథకం ప్రవేశ పెట్టాలని, దీర్గాకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరారు.

- Advertisement -

జర్నలిస్టు లకు అండగా ఉంటాం…

జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కారం అయ్యే సమస్యలన్నీ తప్పకుండా పరిష్కారిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వం విప్ బాల్క సుమన్ లు హామీ ఇచ్చారు. ముందుగా జర్నలిస్టులు సమస్యలను ఓపికతో విన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వేరే ఇతర జిల్లాలలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చరవాణి ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీప్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి నవీన్ విఠల్ కు, సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు ఫోన్ చేసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. అదేవిధంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… జర్నలిస్టులకు ఇళ్ళు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి లో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు కామెర వెంకట స్వామి, మధు ఇతర జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News