Tuesday, September 17, 2024
HomeతెలంగాణManchiryala: 'ఆరోగ్య మహిళ' కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Manchiryala: ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

మహిళ ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలివాడ బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళ ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటులో భాగంగా జిల్లాలో 4 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి మంగళవారం జరిగే ఆరోగ్య మహిళా కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ రోజు 61 మంది మహిళలకు సేవలు అందిస్తామన్నారు. కేంద్రంలో వైద్య సేవలను ఉదయం 9 గంటలకే ప్రారంభించాలని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఆరోగ్య మహిళా కేంద్రంలో డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాల గుర్తింపు, మూత్రనాళ సమస్య, పి.సి.ఓ.ఎస్. మోనోపాజ్, శరీర బరువు నిర్వహణతో పాటు ఐ.ఈ.సి., మొబిలైజేషన్ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కేంద్రంలో 60 నుండి 70 మంది మహిళలను పరీక్షించాలని, ఆరోగ్య మహిళా కేంద్రాలను వినియోగించుకునే విధంగా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 4 కేంద్రాలలో 247 మంది మహిళలకు ఓ.పి. నిర్వహించి 108 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 13 మంది మూత్రనాళ, 49 మంది సూక్ష్మ పోషక, 57 మంది థైరాయిడ్ ప్రొఫైల్, 44 మంది విటమిన్-డి, 54 మందికి సి.బి.పి. పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 9 మందిని మెరుగైన సేవల నిమిత్తం సిఫారసు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డా. నీరజ, వైద్యులు వైష్ణవి, స్వరూప, వందన, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News