ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పాటులో ప్రత్యేక భూమిక పోసించిన, మలి దశ ఉద్యమకారుడు మంచిర్యాల నియోజకవర్గం మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి తన నివాస ఆవరణలో మీడియా సమావేశం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… బిఆరెస్ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో దొరల పెత్తనం మళ్లీ మొదలైందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ కారులకు టికెట్లు ఇస్తేనే మంచిర్యాలలో బీఅర్ఎస్ పార్టీ కొనసాగుతుందని అన్నారు. లేని పక్షంలో పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి వెనుకడబోమని హెచ్చరించారు. వారం రోజుల్లో బిఆరెస్ పార్టీ అధిష్టానంను కలిసి మంచిర్యాల నియోజకవర్గం అభ్యర్థిని మార్చాలని కోరుతామని తెలిపారు. అప్పటికీ అభ్యర్థిని మార్చని పక్షంలో తామే బీసీ
సామాజిక వర్గానికి చెందిన బలమున్న నాయకుడిని మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించి గెలిపించుకుంటామన్నారు. ఈ సందర్బంగా బిఆరెస్ అధిష్టానంకు సవాల్ విసరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, బిసి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Manchiryala: ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలి
మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి