రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ కార్యక్రమంలో యువత బారీ సంఖ్యలో పాల్గొనాలని మంచిర్యాల జిల్లా పిలుపునిచ్చారు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ సందర్బంగా సురేఖ మాట్లాడుతూ… క్విజ్ కంపిటిషన్ గురించిన వివరాలను వెల్లడించారు. రాజీవ్ గాంధీ యూత్ డిక్లరేషన్ సందర్బంగా తెలంగాణ యువతకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు +91 7661899899 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే రిజిస్ట్రేషన్ లింక్ మీ మొబైల్ కి వచ్చేస్తుందన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రతి నియోజకవర్గంలో మొదటి బహుమతి ల్యాప్ టాప్, రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్, మూడవ బహుమతి ట్యాబ్, అలాగే ప్రతి అసెంబ్లీలో 40 కన్సోలేషన్ ప్రైజెస్, పది స్మార్ట్ వాచ్ లు, ఇయర్ పాడ్స్, హార్డ్ డ్రైవ్ లు, పవర్ బ్యాంక్ లు, మరొక ప్రత్యేక బహుమతి వచ్చేసి ప్రతి అసెంబ్లీలో ఒక మహిళకు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ, ఆన్ లైన్ పరీక్ష జూన్ 2న నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలు https://www.rajivgandhiyouthquiz.com/ సైట్ లో పొందుపర్చామన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మహిళా, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.