Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: బొగ్గు రవాణా స్పీడ్ పెంపుపై సమీక్ష

Manchiryala: బొగ్గు రవాణా స్పీడ్ పెంపుపై సమీక్ష

హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి వ్యాప్త సి.హెచ్.పి లపై సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, సి.హెచ్.పి లు అన్ని ఏరియా జనరల్ మేనేజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ప్రస్తుత 10 ప్రధాన సి.హెచ్.పి లకు అదనంగా మరో మూడింటి నిర్మాణం మందమర్రి వద్ద రైల్వే సైడింగ్, సి.హెచ్.పి నిర్మాణం బొగ్గు రవాణా సి.హెచ్.పి నిర్వాహక అధికారులతో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజంగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సింగరేణి సంస్థ మరో రెండేళ్లలో 85 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణాను లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సి.హెచ్.పి)ల లోడింగ్ సామర్థ్యాన్ని ప్రస్తుత 109 మిలియన్ టన్నుల నుండి 133 మిలియన్ టన్నులకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి వ్యాప్తంగా ఉన్న 10 ప్రధాన సి.హెచ్.పి.లు, గనుల వద్ద ఉన్న
16 పిట్ హెడ్ సి.హెచ్.పి.ల పనితీరును సమీక్షించారు.
సింగరేణి సంస్థ ఈ ఏడాది 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో పాటు మరో రెండేళ్లల్లో 85 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు కొత్త గనులు తెరుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సి.హెచ్.పి ల బొగ్గు రవాణా సామర్థ్యాన్ని 2025-26 నాటికి 133 మిలియన్ టన్నులకు పెంచాలని అందుకు అనుగుణంగా కొత్త సి.హెచ్.పి లను నిర్మించాలన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కనీసం ఐదు మిలియన్ టన్నులకు సామర్థ్యాన్ని పెంచాలన్నారు. దీనికోసం ఉప్పల్ సైడింగ్ వద్ద రెండు మిలియన్ టన్నుల సామర్థ్యం గల సి.హెచ్.పి. ని జీడికే-5 ఓపెన్ కాస్ట్ వద్ద ఒక మిలియన్ టన్నుల సామర్థ్యం గల సి.హెచ్.పి. ని ఒడిశా రాష్ట్రంలో గల నైనీ బొగ్గు బ్లాక్ బొగ్గు రవాణాకు ఈ ఏడాది కోసం రెండు మిలియన్ టన్నుల సామర్థ్యం గల సి.హెచ్.పి ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అయితే రానున్న కాలంలో బొగ్గు ఉత్పత్తి 85 మిలియన్ టన్నులకు చేరనున్నది. కనుక ముందస్తు ప్రణాళికలతో 2025-26 నాటికి ఏడాదికి 23 మిలియన్ టన్నుల సామర్థ్యం గల కొత్త సి.హెచ్.పి.లను నిర్మించాలని ఆదేశించారు. కొత్తగా ప్రారంభం కానున్న వీకే-7 ఓపెన్ కాస్ట్ గని వద్ద 10 మిలియన్ టన్నుల సామర్థ్యం గల సి.హెచ్.పి ని ఒడిశా రాష్ట్రంలోని నైనీ వద్ద 10 మిలియన్ టన్నుల సామర్థ్యం గల సి.హెచ్.పి లతో పాటు రామగుండం -2 ఏరియాలో ఐదు మిలియన్ టన్నుల సామర్థ్యం గల సి.హెచ్.పి ని నిర్మించాలని, దీనికి సంబంధించిన అనుమతులు, ప్రణాళికలు ఇప్పటి నుండే అమలు జరపాలని ఆదేశించారు. సింగరేణి సంస్థ మందమర్రి సమీపంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో ఒక రైల్వే సైడింగ్ మరియు సి.హెచ్.పి ని నిర్మించాలని నిర్ణయించింది. గురువారం నాటి సమీక్షలో సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కేకే-1 ఓపెన్ కాస్ట్ గని నుంచి ఉత్పత్తి చేసే బొగ్గును అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్.కె.పి. సి.హెచ్.పి కి రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తున్నారు. ప్రజలు, పర్యావరణ కోణంలో ఇది కొంత ఇబ్బందికరంగా ఉందని భావించిన ఛైర్మన్ ఓపెన్ కాస్టుకు పక్కన కేవలం కిలోమీటర్ దూరంలో రైలు మార్గానికి ఆనుకొని మరో కొత్త సి.హెచ్.పి ని నిర్మించాలని, అక్కడి నుండి బొగ్గు రవాణా చేయడం కోసం రైల్వే సైడింగ్ కూడా నిర్మించాలని ఆదేశించారు. ఫస్ట్ మైల్ కనెక్టివిటీ చర్యల్లో భాగంగా దీన్ని జులై 2024 పూర్తి చేయనున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఏఏ విభాగం వారు ఏఏ పనులు చేయాలన్న విషయంపై సంస్థ ఛైర్మన్ కాల పరిమితులను నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారుల కోసం మరింత సన్నని బొగ్గు సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో దాదాపు 80 శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకే సరఫరా అవుతుంది. అయితే ఇప్పటివరకు సింగరేణి సంస్థ తన సి.హెచ్.పి.ల ద్వారా 250 ఎం.ఎం. కన్నా తక్కువ సైజు గల బొగ్గును రవాణా చేస్తుంది. అయితే విద్యుత్ సంస్థల్లో కొందరు తమకు 100 ఎం.ఎం. కన్నా తక్కువ సైజు గల బొగ్గు కావాలని కోరుతున్నారు. దీనికోసం వారు టన్నుకు 17 రూపాయల చొప్పున అదనంగా ఛార్జీలు చెల్లించటానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ సి.హెచ్.పి లలో ఇందుకు తగు మార్పులు చేసి, వినియోగదారులు కోరుతున్నట్లు ఇకపై 100 ఎం.ఎం. కన్నా తక్కువ సైజు గల బొగ్గును రవాణా చేయడానికి తగు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల సింగరేణికి అదనపు ఆదాయం సమకూరడమే కాక వినియోగదారులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. నాలుగు కొత్త గనుల నుండి 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
అంతకు ముందు సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ 2024-25లో ప్రారంభించనున్న నాలుగు కొత్త గనులపై అంశాల వారీగా సమీక్షించారు. నైనీ బొగ్గు బ్లాకు నుండి ఈ ఏడాది 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని 2024-25 నుండి పది మిలియన్ టన్నుల బొగ్గు సాధించాలని పేర్కొన్నారు. మిగిలిన 3 కొత్త గనులకు రావాల్సిన ఉన్న అటవీ పర్యావరణ అనుమతులను జులై నాటికి సాధించాలన్నారు. వచ్చే ఏడాది నుండి వి.కె. కోల్ మైన్ నుండి 45 లక్షల టన్నులు, జె.కె. ఓపెన్ కాస్టు నుండి 20 లక్షల టన్నులు, గోలేటి ఓపెన్ కాస్టు నుండి 35 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించాలని తద్వారా మొత్తం మీద 20 మిలియన్ టన్నుల బొగ్గును కొత్త గనుల నుండి ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ ఫైనాన్స్ పా ఎన్.బలరామ్, డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్.వి.కె.శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్రపాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్, జనరల్ మేనేజర్ సీపీపీ సి.హెచ్.నరసింహరావు, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ కె.సూర్యనారాయణ, జనరల్ మేనేజర్ (పి అండ్ పి) కె.కొండయ్య, జనరల్ మేనేజర్ (సి.హెచ్.పి.లు) స్వామినాయుడు, జనరల్ మేనేజర్ ఓపెన్ కాస్ట్ మైన్స్ వై.జి.కె. మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News