నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం (Mandha Jagannadham) తీవ్ర అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాసేపట్లో గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని కొండేరు గ్రామంలో జగన్నాథం అంత్యక్రియలను నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
మంద జగన్నాథం మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఆయన సహచరులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథం ఆదివారా రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం చంపాపేట్‌లో జగన్నాథం అంత్యక్రియలు జరగనున్నాయి. 1951 మే 22న జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో జగన్నాథం జన్మించారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996, 1999, 2004లలో టీడీపీ తరపున వరుసగా మూడుసార్లు.. 2009లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు