కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంను ఆకస్మికంగా సందర్శించారు రాజన్న సిరిసిల్ల జోన్ డిఐజి రమేష్ నాయుడు. తనిఖీల్లో భాగంగా తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసు రికార్డులను, క్రైమ్ ఫైళ్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్సై, సిబ్బందిని అభినందించి వారి యోగక్షేమాలను తెలుసుకొని, పరిసరాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, కరీంనగర్ రూరల్ ఎసిపి కరుణాకర్ రావు, సిఐ రమేష్, ఎస్సై ప్రమోద్ రెడ్డి లతో పాటు పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొ న్నారు.