Wednesday, October 30, 2024
HomeతెలంగాణMaoists letter warning BRS leaders: బీఆర్ఎస్ లీడర్స్ కు మావోయిస్టుల వార్నింగ్, కలకలం సృష్టిస్తున్న...

Maoists letter warning BRS leaders: బీఆర్ఎస్ లీడర్స్ కు మావోయిస్టుల వార్నింగ్, కలకలం సృష్టిస్తున్న లేఖ

దళితబంధు-ఆత్మబంధుగా..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇస్తూ మావోలు విడుదల చేసిన లేఖ గురించి తీవ్ర చర్చ సాగుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన దళిత బంధును అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు పేదల దగ్గర డబ్బులు వసూలు చేశారని లేఖలో ఆరోపించారు మావోయిస్టులు. ఇప్పుడు ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలని హెచ్చరికలు చేస్తూ లేఖ రాశారు.

- Advertisement -

దళితబంధు పేరుతో మోసం..

భారత కమ్యునిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ వెలుగులోకి రాగా, గతంలో దళిత బంధు పేరుతో పేదలను తీవ్రంగా మోసం చేసారంటూ లేఖలో ఆరోపించారు మావోలు. అమాయకులను దళిత బంధు ఆశ చూపించి డబ్బులు దన్నుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు తీసుకుని సైతం ఇప్పటి వరకు వారికి ఎలాంటి లబ్ధి కలిగించలేదని, పేదల దగ్గర వసూలు చేసిన డబ్బుల్ని తిరిగి ఇవ్వకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టులు గట్టి హెచ్చరికలు జారీచేశారు.

ఆ బీఆర్ఎస్ లీడర్స్ ఎవరంటే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కీలక బీఆర్ఎస్ నేతలైన మాజీ జెడ్పీటీసీ రాజిరెడ్డి, రామగౌడ్, మండలాధ్యక్షులు బెల్లంకొండ కిష్టయ్య, కాటారం ఎంపీటీసీ తోట జనార్థన్, మాజీ జెడ్పీ ఛైర్మన్ బద్దం రాకేష్, భూపల్లి రాజు సహా మహదేవ్ పూర్ మండలానికి సంబంధించిన మరికొంత మంది బీఆర్ఎస్ నేతల పేర్లను ఈ లేఖలో మావోయిస్టులుప్రస్తావించటం విశేషం. వీరంతా అక్రమంగా పేదల దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. లేఖలో బీఆర్ఎస్ నేతలతో పాటు ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు ప్రస్తావన చేశారు.

లెటర్లో వివరంగా..

దళిత బంధు పథకంలో ఒకేసారి పది లక్షల రూపాయలు మేర ఆర్థిక సహాయం అందుతుండడంతో చాలా మంది పేదలు స్థానిక నేతలకు వారు అడిగినంత ఇచ్చారని మొత్తం వ్యవహారాన్ని మావోలు లేఖలో వివరించారు. చాలా మంది వారి ఆర్థిక స్థోమతకు మంచి డబ్బుల్ని ముట్టజెప్పారని.. ఇప్పుడు వారికి వాటిని తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయటం లేఖ సారాంశం.

లక్షల రూపాయల వసూళ్లు..

దళిత బంధును ఆశగా చూపించి ఒక్కో కుటుంబం దగ్గర ఈ నేతలు ఏకంగా రూ.2 లక్షల మేర వసూళ్లకు పాల్పడినట్లు తెలిపిన మావోలు, అక్రమంగా వసూలు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. కాగా ఈ బెదిరింపు లేఖపై స్పందించేందుకు బి ఆర్ ఎస్ నాయకులు నిరాకరిస్తున్నారు. మావోయిస్టుల పేరుతో లేఖ విడుదల కావడంతో జిల్లాలో ఈ ఘటన గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ లేఖను నిజంగానే మావోయిస్టులు విడుదల చేశారా..? లేదా, బాధితుల్లోనే ఎవరైనా వారి డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు ఇలా చేసారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మావోయిస్టుల లేఖతో పోలీసులు అప్రమత్తమై లేఖపై పూర్తి విచారణ ప్రారంభించారు. ఇదే విషయమై రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. దళిత బంధు పేరులో బీఆర్ఎస్ నాయకులు, వారి అనుచరులే లబ్ధి పొందుతున్నారని, నిజమైన లబ్ధిదారులకు పథకం అందడం లేదని గతంలో విపక్షాలు తీవ్రంగా ఆరోపించిన విషయం మావోల లేఖ నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News