బీజేపీ పార్టీ మూడో జాబితాలో సనత్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి ప్రకటన వెలువడింది. గురువారం వెలువడిన జాబితాలో మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డిని అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అభ్యర్థి ప్రకటన అవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందకర వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు. పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పని చేస్తామని, అందరి సమన్వయంతో ముందుకెళ్ళి సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ కార్యకర్తలు, నాయకుల వెంట నిలిచి పార్టీ విజయాన్ని సుసాధ్యం చేస్తానని పేర్కొన్నారు. తనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్, తాళ్ల జయంతి గౌడ్, విజులాల్, పొలిమేర సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
Marri Sasidhar Reddy: బీజేపీ సనత్ నగర్ అభ్యర్థిగా మర్రి శశిధర్
బీజేపీ మూడో లిస్టులో ఛాన్స్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES