Hyderabad| బంగారం వ్యాపారిని కత్తులతో బెదిరించి నగలు చోరీ(Gold Robbery) చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కోల్‌కతాకు చెందిన నగల వ్యాపారి రంజిత్ దోమలగూడలోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జ్యువెల్లరీ షాపుల నుంచి ఆర్డర్‌లు తీసుకుని నగలు తయారుచేయించి వారికి సరఫరా చేస్తుంటాడు. అయితే గురువారం అర్థరాత్రి దుండగులు ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
- Advertisement -
అనంతరం కత్తులు, తుపాకులతో కుటుంబసభ్యులను బెదిరించి లాకర్‌లో భద్రపరిచిన రెండున్నర కిలోలో బంగారం అపహరించుకుపోయారు. అలాగే కుటుంబసభ్యుల ఫోన్లతో పాటు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.