Sunday, July 7, 2024
HomeతెలంగాణMedak: కలెక్టరేట్ ముట్టడించిన 1500 మంది విద్యార్థులు

Medak: కలెక్టరేట్ ముట్టడించిన 1500 మంది విద్యార్థులు

విజయవంతమైన ఏబీవీపీ ధర్నా

5300 కోట్లు ఉపకర వేతనాలు పెండింగ్ లో పెట్టి విద్యార్థులకు ఉన్నంత చదువులకు దూరం చేస్తున్నారని భగ్గుమంది విద్యార్థి లోకం. ఈమేరకు మెదక్ జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టరేట్ల ముందు ధర్నాలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు 1500 మందితో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలు పాల్గొన్నాయి. ఎబివిపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసి స్వార్థ రాజకీయ పబ్బం గడుపుతోందని ఏబీవీపీ ఆరోపించింది. స్కాలర్షిప్ ఆదారంగా పేద విద్యార్థులు చదువుకుంటున్న ఈ రాష్ట్రంలో 5300 కోట్ల ఉపకార వేతనాలు పెండింగ్లో పెట్టి విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేస్తున్నారని, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి హరీష్ రావు తీరని అన్యాయం చేస్తున్నారని, అది చాలక మెదక్ జిల్లా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఇక్కడి నుంచి తరలిస్తూ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మెదక్ విభాగ్ కన్వీనర్ శ్రీనివాస్ మెదక్ జిల్లా కన్వీనర్ శశికాంత్ నగర కార్యదర్శి ఉదయ్ మెదక్ జిల్లా నాయకులు ప్రశాంత్ శివ దుర్గాప్రసాద్ సంపత్ అక్షయ్ నరేష్ గణేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News