భూస్వాములను, జమీందారులను, పెత్తందారులను ఎదురొడ్డి సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి, వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. గురువారం మెదక్ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 129 జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్ ,జిల్లా రజక సంఘాల నాయకులు తో కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూమహిళలు, బీసీ, ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ , అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నదని ఆన్నారు.
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆమె పోరాటాలు,చరిత్ర ప్రతి గడపకూ చేరాలన్నారు.మనమంతా ఆమె బాటలో నడవడమే ఆమెకు సరైన నివాళన్నారు.నాటి కాలంలోనే, తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామికవాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రజక సంఘం నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నాటి వారి స్పూర్తి తెలంగాణ సాధనలోనూ అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి నాగరాజుగౌడ్ రజక సంఘం సభ్యులు సంబంధిత ప్రజా ప్రతినిధులు బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.