మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎన్నికైనాడు.8వ తరగతిలో కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షను పాఠశాలలో చదువుతున్న బంటోజు భాను ప్రసాద్ తండ్రి బంటోజు వడ్ల రవీందర్ వ్రాయగా, అత్యుత్తమ ప్రతిభ కనబర్చి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికయ్యాడు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు నెలకు 600 రూపాయల చొప్పున స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి విద్యార్థికి అందుతుంది.ఈ స్కాలర్షిప్ కు ఎన్నికైనందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.