Friday, October 18, 2024
HomeతెలంగాణMedchal: ఘనంగా తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

Medchal: ఘనంగా తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

మా రాజు.. మా దైవం.. అన్ని నీవయ్యా అంటున్న అనుచరులు

మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, టి పి సి సి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తల కోలాహలాల నడుమ బోడుప్పల్ బొమ్మక్ గంగయ్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ముందుగా ఉదయం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో బుద్ధనగర్ లోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోడుప్పల్ లోని బొమ్మక్ గంగయ్య కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన తోటకూర వజ్రేష్ యాదవ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ లు హాజరై తోటకూర వజ్రేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తోటకూర వజ్రేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News