ఈ నెల 13న గొంగల్ల శంకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు పోస్టర్ ఆవిష్కరించారు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మంచిర్యాల పట్టణంలొనీ మెడిలైఫ్ ఆసుపత్రిలో ఈ నెల 13న గొంగల్ల శంకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మెగా హెల్త్ శిబిరం నిర్వహిస్తారని తెలిపారు. పేద ప్రజలు వివిధ వ్యాధులు నయం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ హెల్త్ క్యాంప్ లో గుండె, ఛాతీ, నరాలు, ఎముకలు, కిడ్నీ, గైనకాలజీ, కాలేయ తదితర అనారోగ్యాలకు సంబంధించిన వైద్యులు..హైదరాబాద్ కు చెందిన సన్ షైన్, కిమ్స్ ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్ట్ వైద్యులు శ్రీదర్ కస్తూరి పర్యవేక్షణలో వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఉచిత క్యాంప్ నద్వినియోగం చేసుకునే వారు ఒకరోజు ముందుగా ఈ క్రింది మొబైల్ నంబర్స్ 9120108108, 8121081080 లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆరెస్ పార్టీ నేతలు నరెడ్ల శ్రీనివాస్, గొంగల్లా శంకర్ మిత్ర బృందం పాల్గొన్నారు.