అరవై యేండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుంతుందని పట్టు పట్టి తెలంగాణ బిల్లు పెట్టించి అందరి మద్దతు కూడగట్టి బిల్లు ఆమోదం చేయించారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఇందిరాచౌక్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ యువకుల బలిదానాలకు చెలించిపోయిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో నష్టం జరుగుతుందని తెలిసీ పట్టించుకోకుండా, పట్టుపట్టి తెలంగాణ బిల్లు ఆమోదం చేపించారన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీకి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే పాలకులు ఉదయం ఆరుగంటలకే మున్సిపల్ సిబ్బంది ద్వారా తొలగించడం బాధాకరం అని నరేందర్ రెడ్డి అన్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న విషయం తెలిసిన వెంటనే వెళ్ళి నిలదీశానని చివరకు అధికారులు తిరిగి కట్టిచ్చారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎండి తాజ్, బానోతు శ్రవణ్ నాయక్,కొరివి అరుణ్ కుమార్,సమద్ నవాబ్,సయ్యద్ అఖిల్,లింగంపల్లి బాబు,గుండాటీ శ్రీనివాస్ రెడ్డి,గడ్డం విలాస్ రెడ్డి,నిహల్ అహ్మద్,జీడీ రమేష్,ఎండి చాంద్,షేక్ శేహెన్ష,షబానా మహమ్మద్,దన్న సింగ్,ముల్కల కవిత,బత్తిని చంద్రయ్య గౌడ్, సలిమొద్దిన్, ముక్క భాస్కర్, కీర్తి కుమార్, మెతుకు కాంతయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, రాజ్ కుమార్, నదిమ్, నెల్లి నరేష్, మహమ్మద్ భారీ, అష్రాఫ్ ఖురేషి, బషీర్, దామోదర్, నాగుల సతీష్, నాగరాజు, అజ్మత్, కమల్, ఆంజనేయులు పాల్గొన్నారు.