Friday, November 22, 2024
HomeతెలంగాణFood Safety | ఫుడ్ సేఫ్టీ విషయంలో రాజీ పడొద్దన్న వైద్య మంత్రి

Food Safety | ఫుడ్ సేఫ్టీ విషయంలో రాజీ పడొద్దన్న వైద్య మంత్రి

ఫుడ్ సేఫ్టీ (Food Safety) విషయంలో అసలు రాజీ పడొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

- Advertisement -

నిరంతరం ఫుడ్ సేఫ్టీ (Food Safety)పై తనిఖీలు నిర్వహించాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్ పై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని టాస్క్ ఫోర్స్ ను మంత్రి ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లను మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. కుక్ లకు, ఫుడ్ వెండర్స్ కు ఫుడ్ సేఫ్టీ అధికారులు అవసరమైన అవగహన, శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు.

రాష్ట్రం లో ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాల కు ఆదర్శంగా, హైదరాబాద్ కు ఉన్న ఫుడ్ బ్రాండ్ నిలిచేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై తీసుకుంటున్న చర్యలపై కమిషనర్ ఆర్ వి కర్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొoగ్తూ, TGMSIDC ఎండి హేమంత్, DME డా. వాణీ, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్, IPM డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News