వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువ ఉండడం ఒకవైపు మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వైరల్ ఫీవర్ కేసులు మరింత ఎక్కువగా నమోదవు తున్నాయి . ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వం కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణిలు ఆసుపత్రికి చేరుకున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం ఎంతమంది డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు. వారి వివరాలు అందించాల్సిందిగా ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ రాజకుమారి అడిగి తెలుసుకున్నారు.
నర్సింగ్ సిబ్బంది, డయాగ్నొస్టిక్ క్లినికల్ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువవుతున్న సమయంలో వైద్యులు ఎవరు సెలవులు పెట్టకూడదని విధులకు హాజరై ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ తో పాటు వైద్యులకు ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూచించారు.